‘ బాలికల విద్యకు.. ‘ మలబార్ ’ ప్రాధాన్యం..
1 min read
209 మందికి స్కాలర్ షిప్ లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
- సామాజిక సేవలో..మలబార్ భేష్ అని కితాబు..
కర్నూలు, న్యూస్ నేడు:బాలికల విద్యకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ప్రాధాన్యమివ్వడం అభినందనీయమన్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. మంగళవారం నగరంలోని ఓ హోటల్ లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విద్యనభ్యసిస్తున్న 209 విద్యార్థినులకు స్కాలర్ షిప్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి చేతుల మీదుగా బాలికలకు స్కాలర్ షిప్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత వ్యాపార సంస్థ, విభిన్న వ్యాపారాల సమ్మేళనం, మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క మాతృ సంస్థ మలబార్ గ్రూప్ 2024-2025 విద్యా సంవత్సరానికి బాలికల కోసం విద్యా స్కాలర్షిప్లను పంపిణీ చేయడం ప్రశంసనీయమన్నారు. బాలికల విద్యకు మద్దతు ఇవ్వడంలో మలబార్ గ్రూపు యొక్క నిబద్ధతను తెలుపుతుందన్నారు. సామాజిక సేవలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ముందుండటం సంతోషించదగ్గ విషయమన్నారు. అనంతరం స్టోర్ హెడ్ ఫయాజ్ మాట్లాడుతూ దేశంలో 21000 మంది బాలికల విద్యకు మద్దతుగా 16 కోట్ల రూపాయలను కేటాయించారు. ఆంధ్ర రాష్ట్రంలోని 142 కళాశాలల్లో చదువుతున్న 1,928 మంది బాలికల విద్యకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్కాలర్షిప్ కార్యక్రమానికి రూ 1.67 కోట్లు కేటాయించింది. వీరిలో కర్నూలు, నంద్యాల షోరూం కు చెందిన 209 మంది విద్యార్థులు, 18,64,000 లక్షల రూపాయల విలువగల స్కాలర్షిప్లు మంగళవారం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ షోరూమ్ అందించిందన్నారు. కార్యక్రమంలో డివిఈఓ పరమేశ్వర రెడ్డి, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ లాలెప్ప, ప్రిన్సిపల్స్ నాగ స్వామి నాయక్ బి. క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్, సుంకన్న టౌన్ మోడల్ కాలేజి, సయ్యద్ బాబు పాణ్యం కాలేజి, విజయ శేఖర్, మధు, కర్నూలు షోరూం హెడ్ ఫయాజ్, మార్కెటింగ్ మేనేజర్ నూర్ వుల్లా తదితరులు పాల్గొన్నారు.
