ముంబైలో…‘మలబార్ నేషనల్ హబ్’
1 min readప్రారంభించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్రప్ప ఫడ్నవీస్
పల్లెవెలుగు, ముంబై: ప్రపంచంలోని 11 దేశాలలో 330కి పైగా షోరూములున్న ‘మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్’ సంస్థ… ఇండియన్ ఆపరేషన్ కోసం ముంబైలో ‘మలబార్ నేషనల్ హబ్’ సెంట్రలైజ్డ్ బేస్‌ను ప్రారంభించడం సంతోషకరమన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్రప్ప ఫడ్నవీస్. శనివారం మలబార్ గ్రూప్ చైర్మన్ M.P అహమమ ద్; మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు లోక్మత్ మీడియా గ్రూప్ చైర్మన్ విజయ్ దర్దా, మలబార్ గ్రూప్ వైస్ చైర్మన్ K.P అబ్దుల్ సలాం, మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఇండియా ఆపరేషన్స్ MD అషర్ ఓ, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎకే నిషా, కెపి వీరంకుట్టిఇ, మాయింకుట్టి, అబ్దుల్ మజీద్, ఫైసల్, అబ్దుల్లా, వెస్ట్ రీజినల్ హెడ ఫన్జీమ్ అహ్మద్ తదితర ప్రముఖుల సమక్షంలో ‘మలబార్ నేషనల్ హబ్’ సెంట్రలైజ్డ్ బేస్‌ను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్రప్ప ఫడ్నవీస్ ప్రాంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతగాంచిన జ్యువెలరీస్‌లో మలబార్ సంస్థ 6వ అతి పెద్ద జ్యువెలర్స్ రిటైల్‌గా పేరుగాంచడం అభిననందనీయమన్నారు. అనంతరం మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ మాట్లాడుతూ “30 ఏళ్ల మా అద్భుతమైన ప్రస్థానపు వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో మలబార్ నేషనల్ హబ్ ప్రారంభించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. దేశంలో ప్రసిద్ధి చెందిన ఆభరణాలనైపుణ్యాన్నిదేశీయ మరియు ప్రపంచ మార్కెట్లలో వ్యాప్తి చేయడంలో ఎం–ఎన్‌హెచ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భారతదేశంలో మా సంస్థ అభివృద్ధిని వ్యూహాత్మంగా ముందుకు తీసుకెళ్లడం ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.