‘మలబార్’ సేవలు అభినందనీయం: కర్నూలు ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: దేశంలో పేదలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ‘గృహ నిర్మాణ సహాయం’ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ ఖాన్. గురువారం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు షోరూమ్‌లో స్టోర్ హెడ్ ఫయిజ్, మార్కెటింగ్ మేనేజర్ నూర్వుల్లా ఆధ్వర్యంలో మలబార్ గృహ నిర్మాణ కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక బాధ్యతలో భాగంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ గృహ నిర్మాణ సహాయం అందజేయాలని ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ కోరారు.
అనంతరం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గృహ నిర్మాణ సహాయంకు ఎంపికైన 22 మంది లబ్ధిదారులు అందరికీ కలిపి రూ.11లక్షలు అందజేశారు. ఆ తరువాత స్టోర్ హెడ్ ఫయిజ్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు తమ సంస్థ తరుపున ఈ సేవా కార్యక్రమాలను మున్ముందు కూడా కొనసాగిస్తామన్నారు. మలబార్ గ్రూప్ యొక్క సేవ విభాగం కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలను రూపొందించడం మరియు అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. తమ సంస్థ ప్రతి ఏటా లాభంలో 5శాతం మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తుందని ఈ సందర్భంగా స్టోర్హెడ్ ఫయిజ్, మార్కెటింగ్ మేనేజర్ నూర్వుల్లా తెలిపారు.