PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మలబార్​’ సేవలు.. భేష్​ ​: మేయర్​ రామయ్య

1 min read

444 మంది విద్యార్థులకు స్కాలర్​షిప్​లు పంపిణీ

పల్లెవెలుగు వెబ్​: బంగారు , వజ్రాభరణాల వ్యాపార సంస్థలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘మాలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​’ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమన్నారు కర్నూలు నగర మేయర్​ బీవై రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​. సంపాదించిన దాంట్లో కొంతైనా సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలు కలెక్టరేట్​లోని సునయన ఆడిటోరియంలో 444 మంది విద్యార్థులకు స్కాలర్​షిప్స్​ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్​ బీవై రామయ్య, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​, ఐసీడీఎస్​ పీడీ కె. ప్రవీణ విచ్చేశారు.  ఈ సందర్భంగా మేయర్​ రామయ్య, ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా 444 మంది ఇంటర్మీడియేట్​ విద్యార్థినులకు మెరిట్​ ఆధారంగా ఎంపిక చేసి… 43 లక్షలు అందజేయడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్​ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా నగర మేయర్​ బీవై రామయ్య, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ ఆకాంక్షించారు. అనంతరం కర్నూలు మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ షో రూమ్​ హెడ్​ అస్నఫ్ ​ మాట్లాడుతూ రాబోవు రోజుల్లో ఆంధ్రప్రదేశ్​ మొత్తం మీద 5500 మంది విద్యార్థినులకు ఇంటర్మీడియేట్​, డిగ్రీ మెరిట్​ ఆధారంగా ఎంపిక చేసి రూ.8వేల నుంచి రూ.10వేల దాకా స్కాలర్​ షిప్​ ఇచ్చేందుకు తమ సంస్థ ముందుకు వచ్చిందన్నారు.  కార్యక్రమంలో  మార్కెటింగ్​ మేనేజర్​ నూర్​ వుల్లా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author