పత్తికొండలో..మాలల కార్తీక వన భోజనం మహోత్సవం..
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని మాల సోదరులు ఆదివారము పత్తికొండ పట్టణ సమీపంలోని మండగిరి శివాలయంలో కార్తీక వన భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వ్యవసాయ శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ మాధవయ్య ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదర సంజీవయ్య చిత్రపటానికి పూలమాలవేసి వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పత్తికొండ సబ్ జైలర్ చంద్రమౌళి ,ఎంపీపీ నారాయణదాసు, వ్యవసాయ శాఖ రిటైడ్ డిప్యూటీ డైరెక్టర్ స్వర్గీయ మాధవయ్య కుమారుడు శేషు , మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె మల్లికార్జున, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఓబులేసు, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నాయకులు చెన్నయ్య, ఉపాధ్యాయుడు సునీల్ ,జర్నలిస్టులు ప్రవీణ్ రాజు, తుగ్గలి శ్రీనివాసులు, కుంకనూరు రాముడు ,మాల మహానాడు సంఘం నాయకులు ఆస్పరి మహానంది, లాయర్ జనార్ధన్, అగ్రహారం చెన్నయ్య హోసూరు శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జైలర్ చంద్రమౌళి మాట్లాడుతూ మాల సోదరులు ప్రతి ఒక్కరు తమ పిల్లలనుచదివించాలని తెలిపారు. చదువు ఉంటే మనము అనుకున్నది సాధించవచ్చని ఆయన అన్నారు. శేషు మాట్లాడుతూ తన తండ్రి మాధవయ్య పత్తికొండ ప్రాంతంలోనే అందరికీ తెలుసు అని అలాగే నియోజకవర్గ ప్రజలకు వ్యవసాయ పరంగా అనేక సహకారాలు అందించారన్నారు .అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారాని ,తన తండ్రి లాగే నేను కూడా మాల సోదరులకు తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తానని అందుకు తమరు సహకరించాలని ఆయన కోరారు. గతంలో తన తండ్రి మాధవయ్య వనభోజన కార్యక్రమాలు నిర్వహించే వారని అందువల్ల ప్రస్తుతం నేను ఈ వన భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆనంతతం జైలర్ చంద్రమౌళి కి ఎంపీపీ నారాయణదాసు కు శేషు కు సన్మానం చేశారు ఈ కార్యక్రమానికి పత్తికొండ నియోజకవర్గం నుండి దాదాపు 200 మంది సోదరులు హాజరయ్యారు.