రైతుల ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం దుర్మార్గపు చర్యలు…
1 min readరైతు సంఘం నాయకుడు భాస్కర్.
పల్లెవెలుగు వెబ్ పాణ్యం : గత పది రోజులుగా హర్యానా, పంజాబ్ బార్డర్లో వేలాది మంది రైతులు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పరిష్కరించాల్సింది పోయి వారిపైన ద్రోన్లతో టియర్ గ్యాస్ వదులుతూ, వాటర్ క్యాన్లు ఉపయోగించుకొని వారి పైన చల్లుతూ ,పిల్లెట్ గన్ లతో వారి పైన దాడి చేస్తూ ,చివరికి రబ్బర్ బుల్లెట్లతో రైతుల పైన దాడి చేసిన ఫలితంగా పంజాబ్ బటిండ జిల్లా బాలోక్ గ్రామానికి చెందిన యువరైతు శుభకరణ్ సింగ్ రబ్బర్ బుల్లెట్ తగిలి 21 సంవత్సరాల యువకున్ని బలి తీసుకోవడాన్ని రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఎంత కర్కషంగా వ్యవహరిస్తుందో దీనిని ప్రజలందరూ ఖండించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు రైతు సంఘం జిల్లా నాయకుడు కే భాస్కర్ ఒక ప్రకటనలో కోరారు. గత ఢిల్లీలో రైతులు చేసినటువంటి ఆందోళన ఫలితంగా మోడీ ప్రభుత్వము క్షమాపణ చెప్పి రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచాలని కోరుతూ మళ్లీ ఆందోళన చేస్తున్నటువంటి రైతుల పైన విచక్షణారహితంగా హర్యానా పోలీసులు మరియు కేంద్ర ప్రభుత్వ బలగాలు రైతుల పైన దాడులు చేస్తున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతుల పైన ఈ ప్రభుత్వం దుర్మార్గపూరితమైనటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని వారు కోరారు. రైతులను శత్రువులా చూసి కేంద్రబలగాలు వారి పైన విరుచుకుపడడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. యువరైతు మరణం రైతుల యొక్క ఆందోళనలను మరింత ఉధృతం చేస్తుందే తప్ప వెనకడుగు లేదని భవిష్యత్తులో రైతుల యొక్క ఆందోళన జిల్లాలో కూడా మరింత తీవ్రతరం చేస్తామని వారు తెలిపారు .వెంటనే యువ రైతుకు వారి కుటుంబానికి న్యాయం చేయాలని నష్ట పరిహారం చెల్లించాలని వారు కోరారు.