PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమ కార్యచరణ ధర్న..

1 min read

– పలు సమస్యలపై నినాదాలతో హోరెత్తించిన ఉద్యోగులు..
– మద్దతు పలికిన పలు ట్రేడ్ యూనియన్ నాయకులు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏ.పి.జె.ఏ.సి అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ కె. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మలి దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏలూరు జిల్లా కలక్టర్ కార్యాలయం వద్ద “ కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారము “ కొరకు ధర్న కార్యక్రమం నిర్వహించడo జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె. రమేష్ కుమార్ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలని మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ప్రభుత్వ పథకాలు రాయితీలు పునరుద్ధరించాలని, జీవో నెంబర్ 25 ను ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని, బదిలీల సౌకర్యం కల్పించాలని, వార్షిక ఇంక్రిమెంటు ఇవ్వాలని,. సీనియార్టీ ప్రాతిపదికన వేతనాలు ఇవ్వాలని, రెగ్యులర్ ఉద్యోగ నియామకాలలో అవుట్సోర్సింగ్ వారికి వెయిటేజ్ ఇవ్వాలని, అదేవిధముగా రిటైర్మెంట్ తర్వాత విరమణ భృతి 15 లక్షలు ఇవ్వాలని, సమస్యలపై రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ నిర్వహించాలని,. “సమాన పనికి – సమాన వేతనం ఇవ్వాలని” మరియు ఈ హెచ్ ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్) ద్వారా ఉచిత వైద్యం కల్పించాలని, సాధారణ మరియు మెడికల్ లీవుల సౌకర్యం కల్పించాలని, అర్హత సీనియార్టీని బట్టి పదోన్నతులు కల్పించాలని కోరియున్నారు. కావున చాలీ చాలని జీతములతో ఇబ్బందులు పడుచున్న కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమములో APJAC అమరావతి జనరల్ సెక్రెటరి బి. రాంబాబు, రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్, జిల్లా కార్యదర్శి ఏ. ప్రమోద్ కుమార్, APNGO’s జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, JAC రాష్ట్ర నాయకులూ RS హరినాద్, ట్రేడ్ యునియన్ నాయకులు, ANTUC జిల్లా కన్వినర్ బండి వెంకటేశ్వర రావు, CITU జిల్లా కార్యదర్శి ప్రసాద్ మరియు JAC నాయకులు నెరుసు రామరావు, శ్రీధర్ రాజు, వీరబాబు, Ch. వర్మ , జ్యోతి, కమల్ సాయినాద్ మరియు వివిధ ఉద్యోగ సంఘ నాయకులూ పాల్గొన్నారు.

About Author