మల్లన్న దర్శనం …టికెట్ల రీసైక్లింగ్
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: మల్లన్న దర్శనం టికెట్ల రీసైక్లింగ్‌కు పాల్పడుతున్న ఒక అంతర్జాలo నిర్వాహకుడు పై బుధవారం దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. కంప్యూటర్ సిస్టంను స్వాధీనం చేసుకున్నారు. ఆలయ దర్శనం టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తి దర్శనానికి వెళ్లే సమయంలో స్కానింగ్ కాకపోవడంతో ఒకే టికెట్టు రెండుసార్లు రావడంతో విషయం బయటపడింది. అక్కడున్న పర్యవేక్షణాధికారి దృష్టికి స్కానింగ్ సిబ్బంది తీసుకువెళ్లారు. టికెట్ ఎక్కడ తీసుకున్నావ్ అని ఆ భక్తున్ని ప్రశ్నించగా ఆ భక్తుడు తాను ఆన్ లైన్ టికెట్ కొనుగోలు చేసిన షాప్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఆలయ అధికారులు కంప్యూటర్ సిస్టంను తనిఖీ చేశారు. గతంలో కూడా టికెట్లు అక్రమాలు జరిగినందుకే దేవస్థానం ఆన్లైన్ టికెట్ ప్రవేశపెట్టారు ఇంటర్నెట్ నిర్వాహకుడు మీద చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు దేవస్థానానికి ఎటువంటి అప్రతిష్ట పాలు కాకుండా దేవస్థానం అధికారు లుఆలయ టికెట్లు విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని భక్తులు కోరుతున్నారు.