PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌ల్లారెడ్డి మాస్ డాన్స్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మునుగోడు సభకు టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మంత్రులు సైతం హుషారుగా సభకు విచ్చేస్తున్నారు. కాగా, మునుగోడుకు వస్తున్న క్రమంలో మంత్రి మల్లారెడ్డి చేసిన డ్యాన్స్‌ ఈరోజు హైలైట్‌ ఆఫ్‌ ది డేగా చెప్పుకోవచ్చు. తన కాన్వాయ్‌లో వస్తున్న మల్లారెడ్డి ఓపెన్‌ టాప్‌ కారులో నిల్చుని ఊరా మాస్‌ డ్యాన్స్‌ స్టెప్పులు వేశారు. ఇక, కారు దిగిన అనంతరం కూడా మల్లారెడ్డి మాస్‌ డ్యాన్స్‌ స్టెప్పులతో ఇరగదీశారు. ఆయన డ్యాన్స్‌ చేయడంతో అక్కడున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో జోష్‌ పెరిగి మంత్రితో వారు కూడా స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.

                               

About Author