దివ్యాంగురాలికి “మల్లెల గ్రూప్స్” చేయూత
1 min read
పండ్ల వ్యాపారంకు ఆర్థిక సాయం అందించిన మల్లెల జీవన్ సుశీల్
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణం, కలుగొట్ల రోడ్డు ఎస్సీ కాలనీలో నివాసం ఉండుచున్న దివ్యాంగురాలైన యం. శ్యామల కు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) రాష్ట్ర కార్యదర్శి, మల్లెల గ్రూప్స్ అధినేత డా. మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు తనయుడు మల్లెల జీవన్ సుశీల్ టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న తో కలిసి గురువారం పండ్ల వ్యాపారం నిర్వహణకు పదివేల రూపాయలను ఆర్థిక సాయం అందించి చేయూతనిచ్చారు. వివరాల్లోకెళితే… ఎస్సీ కాలనీకి చెందిన దివ్యాంగురాలు శ్యామల తల్లిదండ్రులు అనారోగ్యం పాలై కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. దివ్యాంగురాలు శ్యామల కు వస్తున్న ప్రభుత్వ పింఛన్ కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. దీంతో ఆ అమ్మాయి పండ్ల వ్యాపారం చేయాలని ఆలోచించి మానవతావాది అయిన మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు కు ఆర్థిక సాయం అందించాలని కోరింది. దీంతో స్పందించిన ఆయన తన కుమారుడు మల్లెల జీవన్ సుశీల ద్వారా మల్లెల గ్రూప్స్ తరఫున పండ్ల వ్యాపార నిర్వహణకు పదివేల రూపాయలను ఆర్థిక సాయం అందించి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్లెల గ్రూప్స్ సభ్యులు యు.కె. బాలు మహేష్,యు.కె. గంగాధర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.