తెలంగాణ పై మమతా బెనర్జీ గురి !
1 min readపల్లెవెలుగు వెబ్ :తెలంగాణలో అడుగుపెట్టాలని పశ్చిమ బెంగాల్ సీంఎ మమతా బెనర్జీ ఆలోచిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో తృణమూల్ కాంగ్రెస్ హోమ్ వర్క్ మొదలు పెట్టింది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తృతం చేసే ఆలోచనతో ముందుకెళ్తున్న ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంపైనా దృష్టి సారించింది. ఇందులోభాగంగా కొద్దిమంది కాంగ్రెస్ కీలక నేతలతోపాటు టీఆర్‌ఎస్ అసంతృప్త నేతలతో జాబితా రూపొందిస్తున్నట్టు తెలిసింది. తృణమూల్ కాంగ్రెస్ ను విస్తృతం చేసే బాధ్యతలను మమతా బెనర్జీ ఇటీవల కీలక నేతలకు అప్పగించారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీల బలాలు, వాటి బలహీనతలు తదితర అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో బ్యాక్‌ఎండ్ వర్క్ చేస్తున్న ఓ ఏజెన్సీకి ఈ బాధ్యత అప్పగించినట్టు చర్చ జరుగుతోంది. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల పరిస్థితిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ఈనెల మొదటి వారంలో అధినేత్రికి నివేదికివ్వనున్నట్టు సమాచారం. నిజంగా తృణమూల్ కాంగ్రెస్ కు తెలంగాణలో స్పేస్ ఉందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే షర్మిలా కూడ ఇంట్రీ ఇవ్వడం.. బీఎస్పీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుండటం చూస్తే తెలంగాణలో బహుముఖ పోరు సాగబోతుందనే చెప్పుకోవాలి.