NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యాయ‌మూర్తుల‌పై త‌ప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి అరెస్టు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: న్యాయ‌మూర్తుల‌పై తప్పుడు ప్రచారం చేస్తూ.. వారి తీర్పుల‌ను త‌ప్పుప‌డుతూ సోష‌ల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. క‌డ‌ప ప‌ట్టణానికి చెందిన లింగారెడ్డి రాజ‌శేఖ‌రరెడ్డిని ఏసీబీ, సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయ‌మూర్తుల‌తో పాటు.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల తీర్పుల‌పై సోష‌ల్ మీడియా లో అసభ్యక‌ర ప్రచారం చేస్తున్న రాజ‌శేఖర‌రెడ్డి పోస్టుల‌ను ఏపీ హైకోర్టు కేసు సుమోటోగా స్వీక‌రించింది. విచార‌ణ‌ను సీబీఐకి అప్పగించింది. క‌డ‌ప ప‌ట్టణానికి చెందిన లింగారెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి కువైట్ లో కారు డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తారు. క‌డ‌పకు వచ్చి తిరిగి కువైట్ కు వెళ్లే క్రమంలో పోలీసులు అరెస్టు చేశారు.

About Author