కిడ్నాప్ కేసులో వ్యక్తి అరెస్టు
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: కిడ్నాప్ కేసులో వ్యక్తిని అరెస్టు చేసినట్లు మహానంది పోలీసులు తెలిపారు. మహానంది మండలం సీతారామపురం గ్రామానికి చెందిన జయ నారపు రెడ్డి అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన బుడ్డా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కిడ్నాప్ చేశారని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బుధవారం ముద్దాయి శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ కు ఆదేశించినట్లు మహానంది పోలీసులు తెలిపారు. బండి ఆత్మకూరు ఎస్ఐ బాబు ఆధ్వర్యంలో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు.