పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య..
1 min readపల్లెవెలుగు, వెబ్ గడివేముల: దీర్ఘకాలిక వ్యాధి వేధిస్తుండడంతో ఉబ్బసంతో ఊపిరి పీల్చుకోలేక జీవితంపై విరక్తి చెంది వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది కే బొల్లవరం గ్రామానికి చెందిన మిద్దె వెంకటకృష్ణ గత కొద్ది సంవత్సరాలుగా ఆయాసంతో బాధపడుతున్నాడు పలుచోట్ల చికిత్స తీసుకున్న కోలుకోలేకపోవడంతో మానసికంగా కుంగిపోయి జీవితం పై విరక్తి చెంది సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు గమనించిన బంధువులు హుటాహుటిన మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మంగళవారం ఉదయం మృతి చెందినట్లు మృతుడి భార్య మిద్దె మద్దమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు.