మాండవ్య నదిలో వ్యక్తి గల్లంతు.. గాలింపు చర్యలు ముమ్మరం
1 min read– పరిశీలించిన ఎమ్మెల్యే మేడా, జేసీ గౌతమి, ఆర్డీఓ ధర్మ చంద్రారెడ్డి
పల్లెవెలుగువెబ్, రాయచోటి/వీరబల్లి: అకాల వర్షాల కారణంగా వీరబల్లి మండలంలోని మాండవ్యనది ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ప్రమాదవశాత్తు గడికోట రెడ్డి వారి పల్లి బ్రిడ్జి దగ్గర యువకుడు నీటిలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా పోలీసు , రెవిన్యూ , అగ్నిమాపక అధికారులు, గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని అధికారులు మరియు యంత్రాల సాయంతో పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలను పరిశీలించారు. అధికారులు, గ్రామస్తులను ముమ్మరంగా గాలించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట జె సి గౌతమి, ఆర్ డి ఓ ధర్మచంద్రారెడ్డి ఉన్నారు.
బ్రిడ్జి మరమ్మతు పనులు చేపడతాం: ఎమ్మెల్యే
తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న బ్రిడ్జిని ప్రభుత్వంతో మాట్లాడి మరమ్మతులు పనులు వెంటనే చేయిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి. ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎక్స్ గ్రేషియా అందేలా చూస్తామన్నారు. అదేవిధంగా వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలు సర్వే చేసి నమోదు చేయాలని, రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గాలి వీటి మదన్ రెడ్డి, గాలి వీటి వీర నాగిరెడ్డి , వి.ఆర్ రెడ్డి , మందరం వేణుగోపాల్ రెడ్డి, నాగూర్ రెడ్డి, గంగిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నారాయణ రెడ్డి, రెడ్డప్ప రెడ్డి, రాజారెడ్డి, బాబు రెడ్డి, వీరబల్లి జెడ్పిటిసి శివరాం, మాజీ జెడ్పిటిసి అన్నయ్య, మణికుమార్ రాజు, సారధి రాజు, మట్లి తిమ్మారెడ్డి, రాజా రాజు, నరసింహులు, పాలగిరి మల్లికార్జున్ రెడ్డి, పొత్తపి చంద్ర , మరి వీరబల్లె మండలం ముఖ్య నాయకులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.