ద్విచక్ర వాహనం బోల్తా పడి వ్యక్తి కి గాయాలు
1 min read
మంత్రాలయం , న్యూస్ నేడు : మండల పరిధిలోని కల్లుదేవకుంట గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం బోల్తా పడి వ్యక్తి కి గాయాలైన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎమ్మిగనూరు కు చెందిన రాజేష్ అనే వ్యక్తి తన భార్య ఊరు అయినా మంత్రాలయం మండలం సూగురు గ్రామానికి ద్విచక్ర వాహనంపై రాత్రి వస్తుండగా కల్లుదేవకుంట గ్రామ సమీపంలో రాగానే ద్విచక్ర వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజేష్ కు తలకు, కాళ్ల కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు బంధువులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని 108 లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు.