PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ సీఎంతో మంచు విష్ణు ప్ర‌త్యేక భేటీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం జ‌గ‌న్ తో సినీ న‌టుడు మంచు విష్ణు భేటీ కానున్నారు. మంచు విష్ణుని సీఎం జగన్ ఇవాళ‌ ప్రత్యేకంగా విందుకు ఆహ్వానించారు . మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ వీరు సమావేశమనున్నారు. దీనిలో భాగంగా సినీ పరిశ్రమకు సంబంధించి టిక్కెట్ల వ్యవహారం, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు సహా పలు ఇతర అంశాలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి బృందంతో జరిగిన సమావేశ వివరాలను కూడా సిఎం జ‌గ‌న్ మంచు విష్ణుకు తెలిపనున్నట్టు సమాచారం. చిరంజీవి బృందంతో భేటీ తరువాత ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని.. మోహన్‌ బాబు నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, మోహన్‌ బాబు, మంచు విష్ణు.. సీఎంతో భేటీకి సంబంధించి ఆహ్వానం తమకు అందలేదని మంత్రి పేర్ని నానికి తెలిపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మోహన్‌ బాబు, మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. దాంతో సీఎం దృష్టికి ఈ సమాచారం అందించారు నాని.

                                

About Author