NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంచు విష్ణు విజ‌యం.. ప్రకాశ్ రాజ్ రాజీనామా !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజ‌యం సాధించారు. హైద‌రాబాద్ లోని జూబ్లిహిల్స్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మా ఎన్నిక‌ల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ‌ను ఏర్పాటు చేశారు. మా అధ్యక్షుడిగా విష్ణు విజ‌యం సాధించిన‌ట్టు రిటర్నింగ్ అధికారి ప్రక‌టించారు. మ‌రోవైపు ప్రకాశ్ రాజ్ మా స‌భ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రక‌టించారు. మా ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిగాయ‌ని, ఎక్కువ మంది ఓటు హ‌క్కు వినియోగించుకున్నార‌ని ప్రకాశ్ రాజ్ అన్నారు. తెలుగువాడిగా పుట్టక‌పోవ‌డం త‌న దుర‌దృష్టమ‌ని చెప్పారు. అతిథిగా వ‌చ్చాన‌ని, అతిథిగానే ఉంటాన‌ని చెప్పారు. ప్రాంతీయ‌త ఆధారంగా ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని తెలిపారు. మంచు విష్ణు గెలుపును స్వాగ‌తిస్తున్నట్టు ప్రక‌టించారు.
107 ఓట్ల తేడాతో..
ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో గెలిచారు. విష్ణుకు 381 ఓట్లు రాగా.. ప్రకాశ్ రాజ్ కు 274 ఓట్లు వ‌చ్చాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ లో 883 మందికి స‌భ్యత్వం ఉండ‌గా.. 665 మంది మాత్రమే ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

About Author