రంగనాధునికి అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిసిన మండలాభిషేకం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు శివారులోని మామిదాలపాడు సమీపంలోని శ్రీగోదా గోకులంలో ఇటీవల వెలసిన శ్రీ గోదా రంగనాయకీ సమేత శ్రీ రంగనాథ స్వామి వారికి, పరివార దేవతలకు అత్యంత భక్తిశ్రద్ధలతో మండలాభిషేక మహోత్సవం జరిగింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో వేదపండితులు శ్రీమన్నారాయణాచార్యులు, మాధవా చార్యులు, రమేషాచార్యుల బృందం అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ క్రతువును నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మూర్తుల ప్రతిష్టాపన జరిగి నలబై రోజులు పూర్తి అయిన సందర్భంగా మంత్ర, తంత్ర, క్రియ,వస్తు, ద్రవ్యలోప శాంతి పరిహారార్ధం నిర్వహించే అగ్నిరూపకమైన ఆరాధనే మండలాభిషేకమని అన్నారు. ఈ సందర్భంగా వివిధ నదీ జలాలతోటి 108 కళశాలతో, విశేషమైన ద్రవ్యాలతో మూర్తులను అభిషేకించి, అలంకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోదారంగనాథ రామానుజ కూటమి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మారం నాగరాజు గుప్త, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, గోదాపరివారం భూమా కృష్ణ మోహన్,బి.రమేశ్ కుమార్,యం.భూపాల్ రెడ్డి, పి.వేణుగోపాల్,పాలాది సుబ్రహ్మణ్యం, పెరుమాళ్ళ బాలసుధాకర్, ఇల్లూరి రామయ్య, ఎస్.యు. మహేశ్వరరెడ్డి, టి.శ్రీనివాస్, పి.వి.సుబ్రమణ్యం, తల్లం సురేశ్, పారిశ్రామికవేత్త టి.జి.శివరాజ్, విశ్వహిందూ పరిషత్ జిల్లా అద్యక్షులు గోరంట్ల రమణ, ఆవొపా చీఫ్ మలిపెద్దు నాగేశ్వరరావు, యుగంధర్ శ్రేష్ఠి, వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులతో పాటు మూర్తుల ప్రతిష్టాపన మహోత్సవం తర్వాత జరిగిన ఈ అతి పెద్ద కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.