PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొదుపు భవనం లో మండల సర్వ సభ్య సమావేశం

1 min read

– నిర్వహించిన ఎంపిడిఓ శివరామయ్య
– మండల సర్వ సభ్య సమావేశానికి హాజరు అయిన ఎమ్మెల్యే కాటసాని
– అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలన్నదే జగనన్న ధ్యేయం.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణం లోని పొదుపు భవనం లో ఎంపీపీ మానస వీణ అధ్యక్షతన ఎంపిడిఓ శివరామయ్య ఆధ్వర్యం లో మండల సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరు అయ్యారు.ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎంపిడిఓ శివరామయ్య పూలమాలలతో సత్కరించారు.అనంతరం మండలం లోని అన్ని శాఖల అధికారులతో కలిసి మండలం లో జరుగుతున్న అభివృద్ధి మరియు ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనుల మీద ప్రజా ప్రతినిధుల సమస్యలను తెలుసుకొని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సుదీర్ఘంగా సమీక్ష సమావేశాన్నిఏర్పాటుచేయడంజరిగింది.బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒక సారి జరిగే మండల సర్వ సభ్య సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేసిన కూడా మండల అధికారులు తప్పక హాజరు కావాలని అలాగే గత మూడు నెలల క్రిందట వచ్చిన సమస్యల పరిష్కారం ఏమేరకు చేశారో నివేదికలు అధికారులు తీసుకురావాలని చెప్పారు.అధికారులు విధులు పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది ఉండదు అని చెప్పారు.గ్రామాల్లో వున్న ప్రజా ప్రతినిధుల తో అధికారులు సఖ్యంగా వుండి గ్రామాభివృద్ధి కి సహకరించాలని చెప్పారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ మంచి నీటి సరఫరా, విద్యుత్,జాతీయ ఉపాధి హామీ శాఖ,స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు చెందిన సమస్యలు ఎక్కువగా సభా దృష్టికి రావడం జరిగింది అని కాబట్టి అన్ని శాఖల అధికారులు తమ తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఎమ్మెల్యే కాటసాని అధికారులకు హెచ్చరించారు. ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి వస్తె వాటిని నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధికి సహకరించి మండల ప్రజలమన్ననలుపొందాలనిచెప్పారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ మానస వీణ,ఎంపిడిఓ శివ రామయ్య,మండల ఉపాధ్యక్షురాలు మంగవరపు లక్ష్మి దేవి,షేక్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ ఖైర్,కుర్ణీ సంఘం రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ మేటికల శ్యామల దేవి,బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ మార్కెట్ ఉపాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి,పట్టణ సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ,మండల తహశీల్దార్ శ్రీనివాస గౌడ్,మండల విద్యాశాఖ అధికారిని స్వరూప రాణి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ డివిజనల్ ఇంజినీర్ ఉమాకాంత్ రెడ్డి,వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి,విద్యుత్ శాఖ A.E శ్రీనివాసులు,పంచాయతీ రాజ్ ఇంజినీర్,మండల ఎంపీటీసీలు తాహెర్ హుస్సేన్, ఖాతున్ బీ,పసుపల ఎంపీటీసీ ఎస్.ఉమామహేశ్వరమ్మ ,యాగంటి పల్లె సర్పంచ్ బండి వరలక్ష్మి, భానుముక్కల పరపతి సంఘం సొసైటీ చైర్మన్ నీలిశ్రీనివాసులు,తమ్మడపల్లే సర్పంచ్ యెన్నం వెంకట్రామిరెడ్డి,రామతీర్థం సర్పంచ్ సురేష్ నాయుడు,మండల ప్రజా ప్రతినిధులు,బండి బ్రంహనంద రెడ్డి,చేర్వుపల్లేపుల్లయ్య,తిమ్మాపురం అల్లే సురేష్రెడ్డి,ఏర్రగుడిరామసుబ్బారెడ్డి,మేటికల నారాయణ, నందివర్గం వీరం రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, చిన్నరాజుపాలెం తాండా ఈశ్వర్ నాయక్, రామకృష్ణాపురం కురువ నాగేంద్ర,వెంకటాపురం తూర్పింటి శ్రీనివాసరెడ్డి,అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author