ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలో వివిధ శాఖల అభివృద్ధి నివేదికలను శనివారం నాడు మండల కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి సమావేశ మందిరంలో శనివారం నాడు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు మండలంలోని గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి చేయాల్సిన పనుల పురోగతిని తెలియజేశారు ఈ సందర్భంగా గడిగరేవుల సర్పంచ్ బిఎస్ రామ్మోహన్ రెడ్డి చెడిపోయిన చేతిపంపుల విడిభాగాలు అందుబాటులో లేవని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సొసైటీ చైర్మన్ పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వివిధ గ్రామాల్లో మొక్కజొన్న రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేలా మార్క ఫెడ్ ఎండి ని ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేశామని సోమవారం నుండి కొనుగోలు ప్రారంభించి రవాణా చేసేలా ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు సోమాపురంలో 420 కేబి లైన్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు కష్టపడి ఈ ప్రాంతంలో 10 మండలాలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేస్తున్నట్టు రాజకీయాలు చేయవద్దని స్థానికులు సహకరించాలని కోరారు అలాగే మండల కేంద్రంలో జగనన్న ఇళ్ల పట్టాలను జూన్ 10 కల్లా పంపిణీ చేసి జగన్న గృహాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి. ఎంపీడీవో మల్లీశ్వరప్ప. తాసిల్దార్ శ్రీనివాసులు. ఈ ఓ ఆర్ డి. ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు.