మండల సర్వసభ్య సమావేశం ఖాళీ..
1 min read-బాయికాట్ చేసిన ప్రజాప్రతినిధులు-పాత్రికేయుల అసహనం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన మండల సర్వసభ్య సమావేశం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.11 గంటలకు ప్రజా ప్రతినిధులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు.కానీ మధ్యాహ్నం అయినా కూడా సర్వసభ్య సమావేశ హాల్లోకి ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ కూడా రాలేదు.వారు ఎప్పుడు సమావేశానికి వస్తారా అని వివిధ శాఖల అధికారులు మరియు పంచాయితీ కార్యదర్శులు ఎదురుచూడాల్సి వచ్చింది. కానీ ప్రజా ప్రతినిధులు ఈ సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రజా ప్రతినిధులు తెలిపారు.అసలు విషయం ఏమిటంటే ఈనెల 15వ తేదీన సోమవారం మండలంలోని చింతలపల్లి గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా వేయించిన సీసీ రహదారిని గ్రామ సర్పంచ్ రమణమ్మ మరియు నంద్యాల పార్లమెంటు టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి శిలాఫలకాన్ని ప్రారంభించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు చెప్పకుండా శిలాఫలకాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రజా ప్రతినిధులు నాయకులు మండల అధికారులు ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,ఈవోఆర్డీ ఫక్రుద్దీన్ తదితర అధికారులతో వారు సమావేశమయ్యారు.మండల సర్వసభ్య సమావేశానికి పాత్రికేయులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3: 45 వరకు ఉన్నా కూడా సమావేశం ప్రజా ప్రతినిధులు బాయ్ కాట్ చేస్తున్నట్లు సమావేశం లేదని పాత్రికేయులకు చెప్పాల్సిన బాధ్యత అధికారులకు లేదా అంటూ పాత్రికేయులు అ సహనం వ్యక్తం చేశారు.వచ్చిన వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు వెనుది రగాల్సి వచ్చింది.ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డిని వివరణ కోరగా జిల్లా పంచాయతీ అధికారి వారికి నివేదికను పంపించడం జరిగింది.తర్వాత సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని ఆయన వివరణ ఇచ్చారు.