NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మండల స్థాయి సైన్స్ ఫెయిర్ విజయవంతం…

1 min read

పల్లెవెలుగు వెబ్ హోళగుంద  : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హోళగుండ లో జరిగిన మండల స్థాయి సైన్స్ ఫెయిర్ విజయవంతమైంది .మండలంలోని ఉన్నత పాఠశాల ల విద్యార్థులు సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్నారు.సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు ఎన్‌ఎండీ నజీర్‌ అహమ్మద్‌ లో పీసీ కమిటీ చైర్మన్ సిద్దయ్య MEO-1సత్యనారాయణ MEO-2జగన్నాథం  జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డేవిడ్  ఎల్లర్తి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివశంకర్‌రెడ్డి కమిటీ సభ్యులు మంగయ్య,చంద్ర శేఖర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.కమిటీ అధ్యక్షుడు సిద్ధయ్య రిబ్బన్ కట్ చేసి మండల స్థాయి సైన్స్ ఫెయిర్ ని ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన  సైన్స్, మ్యాథ్స్, మోడల్స్ విశేషాంశంగా ఆకట్టుకున్నాయి.group విభాగంలో Zphigh పాఠశాల హొళగుండ 9వ తరగతి విద్యార్థులు ప్రవల్లిక,పూజ తాయారు చేసిన మోడల్,వ్యక్తిగత విభాగం లో zp ఉన్నత పాఠశాల హోళగుండ 9వ తరగతి విద్యార్థిని జి.అనూష తయారు చేసిన మోడల్,&టీచర్ విభాగం లో కేజీబీవీ టీచర్కె.మాధురి తయారు చేసిన  మోడల్ లు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపికయ్యా యి .గ్రామం లోని వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో సైన్స్ ఫెయిర్‌ను సందర్శించారు.

About Author