PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల స్థాయి ప్రత్యేక అధికారులు.. రీఓపెన్ కేసులపై సమీక్షించాలి

1 min read

– జగనన్నకు చెబుదాంకు సంబంధించి వచ్చిన అర్జీలను ఓపెన్ చేసి సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : మండల స్థాయి ప్రత్యేక అధికారులు సచివాలయాల వారీగా ఎక్కువగా రీఓపెన్ అవుతున్న కేసులపై సమీక్షించడంతో పాటు జగనన్నకు చెబుదాంకు సంబంధించిన అర్జీలను ఓపెన్ చేసి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి వివిధ ప్రభుత్వ అంశాలపై జిల్లా స్థాయి అధికారులు మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ గత సమావేశంలో సమీక్షించిన తర్వాత బియాండ్ ఎస్ఎల్ఏ సమస్యలు చాలా వరకు పరిష్కరించారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రేపు ఉదయం జగనన్నకి చెబుదాం కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించడం జరుగుతుందని, అందుకుగాను జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సచివాలయాల్లో కూడా అందరూ చూడడంతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొనేలా మండల అధికారుల నుండి సచివాలయం సిబ్బంది వరకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గత నెల నుండి ఇప్పటివరకు 1522 గ్రీవెన్స్ రాగా అందులో అందులో 252 పంచాయతీ రాజ్ శాఖ వి ఉండగా 58 కేసులు రీ ఓపెన్ అయ్యాయని రీ ఓపెన్ అయిన కేసులను వెరిఫై చేసి సంబంధిత మండల అధికారులతో సమీక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రీ ఓపెన్ అయిన కేసులలో కూడా వాటిని రిడ్రస్ చేసిన తర్వాత కూడా రీ ఓపెన్ అయిన కేసులను ఎక్సెల్ షీట్ కాలమ్ లో రూపొందించేలా చర్యలు తీసుకోవాలని ఈడీఎం నీ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, సర్వే, పంచాయతీ రాజ్, హౌసింగ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, కాలుష్య నివారణ శాఖలకు సంబంధించిన రీఓపెన్ అయిన కేసులపై సమీక్షించాలన్నారు. అదే విధంగా అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పకుండా వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వ పథకాల అమలుపై నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ హాజరు కావాలని, హాజరు కాలేని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయిన హాజరు అయ్యేలా చూడాలని డిఆర్ఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జగనన్నకు సంబంధించి వచ్చిన అర్జీలను తప్పకుండా ఓపెన్ చేసి చూడాలని అసలు ఓపెన్ చేయని విధంగా ఉండకూడదన్నారు. అర్జీలకు ఎండార్స్మెంట్ ఇచ్చే సమయంలో ఏ కారణంతో చేయలేమా సదరు కారణాన్ని తెలుపుతూ ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు.మండలాల వారీగా పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేసిన వారికి ఈ-కెవైసి పెండింగ్ ఉందని వాటిని మూడు రోజులలోపు పూర్తి చేయాలని అన్ని మండలాల తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.హౌసింగ్ కు సంబంధించి స్టేజ్ కన్వర్షన్ పనులు గత వారం నుండి ఇప్పటి వరకు తక్కువ స్థాయిలో గూడూరు, సి.బెళగల్, చిప్పగిరి, కోడుమూరు, నందవరం మండలాలు చేశారని అందుకు సంబందించిన హౌసింగ్ సిబ్బందితో సమీక్షిస్తూ ప్రతి రోజు ఖర్చు, పురోగతి చూపేలా కృషి చేయాలని అందుకు గాను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లిఖార్జునను నియమించడం జరుగుతుందన్నారు.ఉపాధి హామీ కార్మికుల వేతనాన్ని పెంచేలా కృషి చేయాలన్నారు. లేబర్ మొబిలైజేషన్ కి సంబంధించి కల్లూరు, దేవనకొండ, మద్దికేర ,కోడుమూరు మండలాల్లో తక్కువగా నమోదు చేశారని వచ్చే వారంలోపు లక్ష్యాన్ని సాధించేలా సంబంధం ఎంపీడీవో లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా ఆదోని ప్రాంత అభివృద్ధికి గాను హార్టికల్చర్ పెంపకానికి గాను భూములను గుర్తించేలా చూడాలని ఎంపిడిఓలు, స్పెషల్ ఆఫీసర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.పంచాయతీ రాజ్ కు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు సంబంధించిన నగదు జమ చేయడం జరిగిందని, అందుకుగాను రూఫ్ లెవెల్ పై స్థాయి నిర్మాణాలలో పురోగతి చూపేలా కృషి చేయాలని పిఆర్ ఇంజనీర్లను, ఎం పిడి ఓ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.అనంతరం జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య ఓటిఎస్ అంశంపై సమీక్ష నిర్వహిస్తూ ఓటిఎస్ కు సంబంధించిన పెండింగ్ రిజిస్ట్రేషన్ వెరిఫై చేయించి పూర్తి నివేదిక శుక్రవారంలోపు పంపాలని తహశీల్దార్లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుబ్రమణ్యం, హౌసింగ్ పిడి వెంకట నారాయణ, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author