మండల అధికారులు కనబడుటలేదు.. ఆచూకీ తెలపండి..
1 min read– గడివేముల గ్రామ రైతులు
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఆరుగాలం కష్టించి పంటలను పండించే రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్న అధికారులు .కోతులు. పందులు. మొక్కజొన్న మినుములు పంటలు చేతికొచ్చే సమయంలో పందులు పంటను పాడు చేస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల శివారులో పంటలు సాగుచేసిన రైతులకు పందులు, కోతుల బెడద నెలకొన్న ఎన్నోసార్లు??? అధికారులకు విన్నవించుకున్న మా కుటుంబాలకు మేము అధికారులము మీకు కాదన్నట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ఉన్నారా లేరా.???. గ్రామంలో వందల సంఖ్యలో పందులు ఉన్న పంచాయతీ అధికారులు మండల స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు, దీంతో గ్రామ శివారు ప్రాంతంలో సాగుచేసిన మొక్కజొన్న, మినుములు, వరి ,ఇతర పంట చేలలో పందులు పడి నాశనం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట చేల్లో పందుల సంచారంతో మొక్కజొన్న నేల పాలవుతుంది. పందులు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో (రెండు నెలల క్రింద) రైతులు జిల్లా కలెక్టర్ కు స్పందనలో అర్జీ పెట్టిన మండల అధికారులు ముగ్గురు సభ్యుల కమిటీతో కాలక్షేపం కాలయాపన చేస్తూ మాకేమి పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో . పందుల బెడద సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు మా మీద ప్రేమ లేకపోతే మాకు గ్రామ బహిష్కరణ చేయండి అంటూ రైతులు వేడుకుంటున్నారు లేకపోతే అధికారులు కనబడుటలేదని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు
చేతికి అందిన పంట సర్వనాశనం.. షేక్ చాంద్ బాషా, కౌలు రైతు
గ్రామంలో మూడు ఎకరాలు కౌలుకు పొలం తీసుకుని రెండు ఎకరాల్లో మొక్కజొన్న, ఒక ఎకరంలో మినుములు వేశాను ఎకరాకు దాదాపు 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఖర్చు చేసి పంటను పండిస్తే పండిస్తే, ఆదాయం దేవుడికి ఎరుక ఏమోగానీ పందుల బెడదతో కోతుల బెడదతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్లు లేదు. పంట నష్టంతో కౌలు చెల్లించలేని పరిస్థితి నెలకొనేటట్లు ఉంది. చేతికొచ్చిన పంట పందులు నాశనం చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.