మండల స్పెషల్ అధికారులు వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి
1 min read
ప్రతి వారం వెళ్ళి మండలాలకు వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షలు నిర్వహించాలి
ప్రతి నెలా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : మండల స్పెషల్ అధికారులు వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని, ప్రతి వారం మండలాలకు వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు.. బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో మండల స్పెషల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు నెలల్లో ఎన్ని రోజులు మండలాలకు వెళ్లారు? త్రాగునీరు సమస్య ఉందా, పారిశుద్ధ్యం ఎలా ఉంది, పాజిటివ్ పర్సెప్షన్ ఎలా ఉంది, జిఎస్డబ్ల్యూఎస్ సర్వీసులు, హౌసింగ్ పరిస్థితి ఏంటి, ఉపాధి హామీ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడైనా సమస్యలు గుర్తించారా అని మండల స్పెషల్ అధికారులను ప్రశ్నించారు..మండల స్పెషల్ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు.. ప్రతి వారం మండలాలకు వెళ్లి అన్ని ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష చేయాలన్నారు..తాగునీరు, పారిశుధ్యం, హౌసింగ్, పాజిటివ్ పర్సెప్షన్,జిఎస్డబ్ల్యూఎస్ సర్వీసులు, తదితర అంశాలపై తప్పనిసరిగా సమీక్ష చేయాలన్నారు. ఎక్కడైనా నిర్దిష్ట సమస్య ఏమైనా ఉంటే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మండల స్పెషల్ అధికారులను ఆదేశించారు.. ఏమైనా ఇంకా పెద్ద సమస్యలు ఉంటే తన దృష్టి కి కూడా తీసుకొని రావాలన్నారు.మండల స్పెషల్ అధికారిగా ఉన్నప్పటికీ గత 2 నెలల నుండి తనకు కేటాయించిన నందవరం మండలానికి వెళ్లి మండల పురోగతి పై సమీక్ష నిర్వహించలేదని నందవరం మండల స్పెషల్ అధికారి, పరిశ్రమల శాఖ ఇంచార్జి జిఎం ను సంజాయిషీ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు .వేదవతి నదికి వరద వచ్చిన పరిస్థితుల్లో సంబంధిత మండలాల స్పెషల్ అధికారులు విజిట్ చేసి రెవెన్యూ అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, కర్నూల్ మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, మండల స్పెషల్ అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ ఆర్డీఓ భరత్ తదితరులు పాల్గొన్నారు.