NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒక్క రోజులో 125 కోట్లు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ‌లో మందుబాబులు రికార్డు సృష్టించారు. బుధ‌వారం నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందున్న ప్రక‌ట‌న‌తో రోడ్ల మీద‌కి వ‌చ్చేశారు. వైన్స్ షాపుల‌ను ఖాళీ చేసేశారు. ఒక్క రోజులోనే ఏకంగా రూ. 125 కోట్ల మ‌ద్యాన్ని కొనుగోలు చేసిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. గ‌తంలో లాగ లాక్ డౌన్ పొడిగింపు ఉంటుందన్న అంచ‌నాతో వీలైనంత ఎక్కువ‌గా మ‌ద్యాన్ని కొనుగోలుచేశారు. కోవిడ్ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండా… మ‌ద్యం షాపుల ముందు క్యూ క‌ట్టారు. లాక్ డౌన్ ప‌దిరోజుల పాటు కూడ ఉద‌యం 6 నుంచి 10 వ‌ర‌కు మ‌ద్యం అమ్మకాలు ఉంటాయ‌ని ఎక్సైజ్ శాఖ ప్రక‌టించినా.. మందుబాబులు భారీ మొత్తంలో కొనుగోలుకు మొగ్గు చూపారు. అధికారిక లెక్కల ప్రకారం డిపోల నుంచి 125 కోట్ల మ‌ద్యం వైన్స్ షాపుల‌కు త‌ర‌లింద‌ని అధికారులు చెబుతున్నారు. సాయంంత్రానికి చాలా వైన్స్ షాపులు ఖాళీ అయ్యాయ‌ని అధికారులు తెలిపారు.

About Author