అయ్యకొండ లో మంగళ కైశిక ద్వాదశి వ్రతం
1 min readపల్లెవెలుగు, వెబ్ గొనెగండ్ల : దాస వైభవాన్ని చాటి చెప్పుటకు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా లోని నాలుగు దేవాలయాలు కేంద్రంగా మంగళ కైసిక ద్వాదశి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన పుస్తకాలను, ప్రచురణ సామాగ్రిని స్థానిక భక్తులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సమాజంలో ప్రతి కులానికి ఒక విశిష్టత ఉన్నదని, ప్రతి కులంలో ఒక మహా పురుషుడు జన్మించి మొత్తం సమాజానికి సరైన దారితెన్నులు చూపించారని, అటువంటి మహనీయుల జీవితాలను నేటి సమాజానికి ఆదర్శంగా చూపించేడానికే ఈ కార్యక్రమాలు అని అన్నారు. ఇందులో భాగంగానే మాల దాసరిగా నేడు అందరి చేత పూజలందుకుంటున్న సత్యమూర్తి చాలా గొప్ప వైష్ణవ భక్తుడని, సత్యనిష్ఠ గొప్పతనాన్ని చాటిన మహనీయుడనిమంగళకైసికి అనే రాగంతో శ్రీమహావిష్ణువును ప్రత్యక్షం చేసుకున్న భక్త శిఖామని అని వివరించారు. వారి ధార్మిక జీవనానికి సంబంధించిన చరిత్రను సమాజానికి తెలుపుటకు ,భక్తి వైభావాన్ని చాటుటకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలం, అయ్యకొండ గ్రామంలోని శ్రీ చింతల ముని నల్లారెడ్డి స్వామి దేవస్థానం, సి.బెళగల్ లోని శ్రీ చింతల ముని నల్లారెడ్డి స్వాముల దేవస్థానం, నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణం గోపాల్ నగర్ లోని శ్రీఆంజనేయ స్వామి దేవస్థానము, ఆళ్ళగడ్డ బస్టాండ్ సమీపంలోని శ్రీరామాలయం నందు నవంబర్ నెల 5వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఈ మంగళ కైశిక ద్వాదశి కార్యక్రమాలను ఒక ఉత్సవం లాగా భక్తులందరూ కలిసి జరుపుకుంటారని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మునిస్వామి, విద్యాకమిటి చైర్మన్ బాలరాజు,బుడ్డ వెంకన్నా, రంగన్నా,మాల దాసరి నాగేశ్ ,ఓబులయ్య, రంగస్వామి,చిన్నరంగన్నతదితరులు పాల్గొన్నారు.