డీపీఓ ఆధ్వర్యంలో ఓటు నమోదు ప్రక్రియపై మానవహారం..
1 min readఘనంగా ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభం..
ఓటు ద్వారా సమసమాజ స్థాపనకు సహకరించాలన్న డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరు వినియోగించు కోవాలని జిల్లా పంచాయతీ అధికారి మరియు మండల ప్రత్యేక అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో మండలంలో రెండు రోజులు స్పెషల్ సర్వే రెవిజన్ జరగనున్న సందర్భంలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ శనివారం ప్రారంభమయ్యింది. సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ మండలంలో 59 పోలింగ్ కేంద్రాలలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటారని 01 జనవరి 2024 తేదీ నాటికీ 18 సంవత్సరాలు నిండనున్న యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అన్నారు. అలాగే మరణించిన ఓట్లను తొలగించడం, గ్రామంతరం వెళ్లిన వారు ఓట్లను వారి అభ్యర్ధనతో మార్పులు చేయడం జరుగుతుందని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. మండలంలో 56840 ఓట్లు నమోదు కాబడ్డాయని, కొత్త ఓట్లు నమోదు ప్రక్రియ తర్వాత తేదీ 05 జనవరి 2024 నాటికీ తుది ఎలక్ట్రాల్ వెలువడుతుందని అన్నారు. సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ఇంటింటికి వెళ్లి ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. దుఖానాలు సందర్శించి ఓటరు గుర్తింపు కార్డు ఉందా లేదాని ఆరాతీశారు.
విద్యార్థులతో మానవహారం
ఓటు నమోదు ప్రక్రియలో భాగంగా పెదపాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మానవహారం నిర్వహించారు. సందర్బంగా డీపీఓ మాట్లాడుతూ విద్యార్థులు నవసమాజ నిర్మాతలు అని, ఓటు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నమ్ముకోవాలేగాని అమ్ముకోకూడదని హితబోధ చేసారు. ఆదర్శవంతమైన సమాజం ఉన్నతమైన భావజాలంతో ఉన్న నాయకుడితో సాధ్యనని అటువంటి నాయకుడిని ఎన్నుకోవడం ఓటు ద్వారా సాధ్యమని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ జీ. విజయకుమార్, ఎంపీడీఓ సూర్యకుమార్, ఏ. యస్. ఓ ఆదినారాయణ, వీఆర్వో కోటేశ్వరరావు, కార్యదర్శి వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.