చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా మనోజ్ పాండే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : భారత కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా మనోజ్ పాండే పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. మార్చి నెలాఖరులో పదవీ విరమణ చేస్తున్న ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే స్థానంలో పాండే పగ్గాలు చేపడతారు. ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ స్థానంలో ఆ పదవిని జనరల్ నరవణే చేపట్టే అవకాశాలున్నాయి. గత ఏడాది డిసెంబర్ 8న విమానం కుప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 12 మంది సాయుధ సిబ్బంది మృతి చెందిన ఘటన యావద్దేశాన్ని కుదిపేసింది.