PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేటి నుండి మంత్రాలయం రాఘవేంద్రుని గురు భక్తి ఉత్సవాలు

1 min read

12న 403వ పట్టాభి షేకం మహోత్సవం

 16న 429 వ (వర్థంతి) జన్మదిన వేడుకలు

 పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున జీవ సమాధి  మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి గురువైభవ మహోత్సవాలు  సోమవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో  11వ, తేదీ నుంచి 16వ,తేదీ (శనివారం) వరకు   శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా మొదటి రోజు  (సోమవారం) శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు. రెండవ రోజు మంగళవారం శ్రీ రాఘవేంద్రుని 403 వ పట్టాభిషేక మహోత్సవం పురస్కరించుకుని, శ్రీ రాఘవేంద్ర స్వామి స్వర్ణ పాదకులకు, ముత్యాలు, పుష్పాలతో అభిషేకం నిర్వహిస్తారు. 16వ,తేదీ శ్రీ రాఘవేంద్ర స్వామి 429 వ, జన్మదిన(వర్థంతి) వేడుకలు సందర్భంగా  స్వామి మూల బృందావనానికి వేయి లీటర్లతో విశేష క్షీరాభి షేకం, పుష్పాభి షేకం  అత్యంత వైభవంగా చేస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు  సమర్పిస్తారు. గురు వైభవోత్సవాలు తిలకించేందుకు  ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు వివిధ రాష్ట్రాల నుంచి  వివిధ శాఖల అధికారులు,  ప్రముఖులు విచ్చేయు చున్నారు. గురు వైభవోత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన  ప్రముఖులకు శ్రీ రాఘవేంద్ర స్వామి అనుగ్రహ ప్రశస్తి అవార్డులను ప్రదానం చేస్తారు. ఆరు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మఠం యోగీంద్ర కళామంటపంలో  ప్రముఖ విద్వాన్, పండితుల ప్రసంగాలు, వివిధ పుస్తకాల ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించు నున్నారు.  శ్రీ ప్రహ్లాద రాయలను వివిధ రథోత్సవాలపై ఉంచి మఠం ప్రాకారంలో అశేష భక్తుల నడుమ ఘనంగా ఊరేగించ నున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు.

About Author