మహిళలకు మనుస్మృతి గొప్పవరం.. జడ్జి పై విమర్శలు !
1 min readపల్లెవెలుగువెబ్ : భారతీయ మహిళలకు మనుస్మృతి గొప్ప వరంలాంటిదంటూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. ఫిక్కీ బుధవారం నిర్వహించిన సదస్సులో జస్టిస్ ప్రతిభా సింగ్ మాట్లాడుతూ మనుస్మృతి కారణంగా సమాజంలో మహిళల గౌరవం పెరిగిందని చెప్పారు. ‘‘మన ధర్మ శాస్త్రాలన్నీ మహిళలకు ఎంతో గౌరవ స్థానాన్ని కల్పించాయి. మహిళలను గౌరవించకపోతే చేసిన పూజలకు అర్థం లేదని మనుస్మృతి చెబుతోంది’’ అన్నారు. ఉద్యోగాలు చేసే మహిళలు ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే మంచిదని సూచించారు. అలాంటి కుటుంబాల్లోని పురుషులు మహిళలను ప్రోత్సహిస్తారని చెప్పారు.