NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బహుజనులలో చైతన్యం నింపిన మహనీయులు మాన్యశ్రీ కాన్సిరాం

1 min read

– జె అండ్ జె కరుణోదయ సంస్థ చైర్మన్ కలతోటి డొమినిక్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్థానిక ఎన్ఆర్ పేట జె అండ్ జె కరుణోదయ సంస్థ కార్యాలయం నందు జై జైకరుణోదయ సంస్థ మరియు ఎస్సీ ఎస్టీ బహుజన రైట్స్ ప్రొటెక్షన్ వారి ఆధ్వర్యంలో బహుజన నాయకులు, సమతవాది, మాన్యశ్రీ కాన్సిరాం 89వ జయంతి కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు మేతర అజయ్ బాబుఅధ్యక్షతన జరిగినది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. జై అండ్ జై కరుణోదయ సంస్థ చైర్మన్ కలతోటి డూమ్నిక్ మాట్లాడుతూ కాన్సిరాం అంటే బహుజనలకు ఉత్తేజం నింపిన నాయకులు వారిని రాజ్యాధికారం వైపు చైతన్యం నింపి. స్వపరిపాలనదిశగా పయనించేలా చూపి నిరూపించి వారిలో రాజకీయ, సామాజిక చైతన్యం నింపి వారిని ఉన్నతమైన స్థితిలో నిలిపిరనిన్నరు. మేతర అజయ్ బాబు మాట్లాడుతూ జ్యోతిబాపూలే అంబేద్కర్ భావజాలంతో వారి మార్గాల్లో నడిచిన బహుజన నాయకులు, నిబద్ధతగల నాయకులు, మాన్యశ్రీ కాన్సిరాం. భారత దేశ రాజకీయ వ్యవస్థలు కొత్తవరవీడి సృష్టించి దళిత, బహుజనలకు రాజకీయ చైతన్య స్ఫూర్తినింపిన గొప్ప నాయకులన్నారు. దళిత నాయకులు కాశీ కృష్ణ మాట్లాడుతు కాన్సిరాం ప్రజాసేవకె తన జీవితాన్ని అంకితమిచ్చి దేశ చరిత్రలో ఎనలేని సామాజిక సేవలు చేసిన వ్యక్తి ,బడుగు బలహీన వర్గాల హృదయాల్లో నిలిచిన మహనీయులు. నాయకులు, వారి ఆశయ సాధనకు మనందరం ఐక్యంగా పయనిద్ద మన్నరు. ఈ కార్యక్రమంలో అశోక్,అఖిల్, పవన్ ,రామ్ ,కుమార్, విజయ్ బాబు కార్యలయ సిబ్బంది, యూత్ కమిటీ తదితరులు పాల్గొన్నారు.

About Author