PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మావో నేత హ‌రిభూష‌ణ్ మృతి.. ఎమ్మెల్యే సీత‌క్క క‌న్నీరు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మావోయిస్టు నేత, గెరిల్లా యుద్ధ తంత్ర వ్యూహ‌క‌ర్త హ‌రిభూష‌న్ అలియాస్ సూప నారాయ‌ణ అలియాస్ జ‌గ‌న్ అనారోగ్యంతో మ‌ర‌ణించారు. ఉద్యమంలో హ‌రిభూష‌ణ్ కీల‌కంగా ప‌నిచేశారు. యుద్ద విద్యల్లో ఆరితేర‌డంతో.. మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్నో ఎదురుకాల్పుల నుంచి త‌ప్పించుకున్న ఆయ‌న చివ‌రికి అనారోగ్యం కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. ఆయ‌న స్వస్థలం మ‌హ‌బూబాబాద్ జిల్లా గంగారం మండ‌లం మ‌న్నెగూడం. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న ములుగు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే సీత‌క్క .. మ‌న్నెగూడెం చేరుకున్నారు. వారి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. కుటుంబ స‌భ్యుల క‌న్నీరు చూసి.. సీత‌క్క కూడ కంట‌త‌డి పెట్టారు. హ‌రిభూష‌న్ టీం లీడ‌ర్ గా ఉన్న స‌మ‌యంలో ..తాను కూడ మావోయిస్టు పార్టీలో ప‌నిచేశాన‌ని సీత‌క్క చెప్పారు.

About Author