PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎంకు వ్య‌తిరేకంగా మావోయిస్టుల పోస్ట‌ర్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేర‌ళ సీఎం పినరయి విజయన్‌ పాలనను మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా సీపీఐ మావోయిస్టుల పేరిట కేరళలో పోస్టర్లు వెలిశాయి. కోరికోడ్ జిల్లా మట్టికున్ను ప్రాంతంలో ఆదివారం ఈ పోస్టర్లు కనిపించాయి. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, సిల్వర్‌లైన్ సెమీ-హై స్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్టు చేపడుతూ కేరళ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని పోస్టర్లలో మావోయిస్టులు విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్నే, కేరళలోని అధికార ఎల్‌డీఎఫ్ అనుసరిస్తోందని మావోయిస్టులు పేర్కొన్నారు.

                            

About Author