మావోయిస్టులు.. శాంతిచర్చలకు సిద్ధం !
1 min readపల్లెవెలుగువెబ్ : మావోయిస్టులు. శాంతిచర్చలకు తామూ సిద్ధమేని ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రకటించింది. అయితే అందుకు కొన్ని షరతులు విధిస్తూ ఈ నెల 5న రెండు పేజీల లేఖ విడుదల చేసింది. చర్చలు ఎలా ఉండాలి.. ఇరుపక్షాలు ఎలా వ్యవహరించాలి.. మావోయిస్టు పార్టీ ఏం కోరుకుంటోందో ఇప్పటికే దండకారణ్య పార్టీ అధికార ప్రతినిధి వికల్ప్ స్పష్టత ఇచ్చారు. శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ కొన్ని షరతులు పెట్టింది. ‘రాష్ట్ర సర్కారు శాంతిని కోరుకుంటే ముందు యుద్ధాన్ని ఆపించాలి. చర్చలకు సానుకూల వాతావరణం కల్పించాలి. మావోయిస్టుపార్టీ, పీఎల్‌జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)సహా ప్రజాసంఘాలపై విధించిన నిషేధం ఎత్తివేయాలి. మావోయిస్టు పార్టీ బహిరంగ కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించాలి. చర్చల కోసం జైలులో ఉన్న పార్టీ నేతలను విడుదల చేయాలి. ఏరియల్ బాంబింగ్‌ను ఆపి సాయుధబలగాలను వెనక్కి పిలిపించి వాటి క్యాంపులను ఎత్తివేయాలి. బస్తర్ సహా డీకేలోని బలగాలు, వాటి క్యాంపులను వెనక్కి పిలిపించుకోవాలి’ అని వికల్ప్ తన లేఖలో పేర్కొన్నారు.