PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మార్చిలో బ్యాంకుల‌కు సెల‌వు దినాలు ఇవే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మార్చి నెలలో బ్యాంకులు కొన్ని రోజులు మాత్ర‌మే ప‌నిచేయ‌నున్నాయి. బ్యాంకులకు మొత్తం 11 రోజులు సెలవులు ఉంటాయి. ఈ సెలవులు అనేవి ఇతర రాష్ట్రాలలోని పండుగలను కలుపుకొని ఉంటాయి. బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్​బీఐ ప్రకారం వచ్చే నెలకు సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేసింది. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 11 రోజులు సెలవులు ఉండకపోవచ్చు. ఎందుకంటే.. సెలవులను స్థానిక పండుగలు, ఇతర ప్రత్యేక దినాలను ఆధారంగా చేసుకుని నిర్ణయిస్తారు.

సెల‌వు రోజులు :
మార్చి 1- మహాశివరాత్రి(దేశవ్యాప్తంగా), మార్చి 3- లోసర్​ సిక్కిం, మార్చి 4- చాప్ చర్ కుట్ (మిజోరం), మార్చి 6- ఆదివారం సాధారణ సెలవు, మార్చి 12- రెండో శనివారం సాధారణ సెలవు, మార్చి 13- ఆదివారం సాధారణ సెలవు, మార్చి 18- హోలీ(దేశవ్యాప్తంగా), మార్చి 20- ఆదివారం సాధారణ సెలవు, మార్చి 22- బిహార్​ దివాస్​, మార్చి 26- నాలుగో శనివారం, మార్చి 27- ఆదివారం.

                                       

About Author