గజ్జహళ్లి గ్రామంలో మారెమ్మ దేవర ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: మండల పరిధిలోని గజ్జహళ్లి గ్రామంలోమారెమ్మ దేవర ఉత్సవాలు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమయ్యాయి. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే అమ్మవారి రథోత్సవాన్ని మారెమ్మ దేవాలయాలకు తీసుకువచ్చి ఉత్సవమూర్తులను అధిష్టించి పూజలు ప్రారంభించారు. మేటి పూర్ణకుంభాలు గ్రామ పెద్దలైనటువంటి ఊరు మాడు నారాయణ రెడ్డి, గోపాల్ రెడ్డి వారి ఇంటి నుండి బయలుదేరాయి. బుధవారం ఉదయం మారెమ్మ దేవాల యాల్లో భక్తులు డప్పు వాయిద్యాల మధ్య, కలశాలతో, పూర్ణ కుంబాలతో ర్యాలీగా తీసుకెళ్లి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో గ్రామస్తులు కలిసికట్టుగా ఈ సంబరాలు జరుపుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హోళగుంద ఎస్సై బాల నరసింహులు గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.