మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి !
1 min readపల్లెవెలుగువెబ్ : భారతస్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. రుతుపవనాలు సకాలంలో వస్తాయి సమృద్ధిగా వర్షాలు పడతాయనే సానుకూల వార్తలు ఉన్నా మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటు పెంచవచ్చనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా ఐటీ, మెటల్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 55,610 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ వచ్చింది. ఉదయం 9:50 గంటల సమయంలో 393 పాయింట్లు నష్టపోయి 55,375 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 261 పాయింట్లు నష్టపోయి 16,475 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.