PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మార్కెట్ యార్డ్  అసంఘటిత కార్మికులకు అవగాహన సదస్సు

1 min read

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరంలోని మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు , చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఎస్.మనోహరు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సి.సాంబశివ, న్యాయవాది పి.నిర్మల, అసంఘటిత కార్మికులకు, తదితరులు పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు  మాట్లాడుతూ అసంఘటిత కార్మికులకు అవసరమైన సహాయం ఉచితంగా అందించడానికి ఈ సంస్థ ఉంది. ప్రతి ఒక్క కార్మికుడు e-Shram, PM-SYM కార్డును చేయించుకుంటే ఎంతో లబ్ధి పొందవచ్చు దీని వల్ల మీకు మీ కుటుంబానికి ఉపయోగపడుతుతుంది. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఎస్.మనోహరు మాట్లాడుతూ ఉన్నత న్యాయ సేవ  అధికార సంస్థ ఏర్పాటుచేసిన  లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ సిస్టమ్ ద్వారా అందిస్తున్న మెరుగైన ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సి.సాంబశివ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికుడు e-Shram కార్డు ఉంటే ఎంతో లబ్ధి పొందవచ్చు.  నమోదు కావడానికి కావలసినది, ఈ కే వై సి (e-KYC)   కలిగిన కార్మికుని  ఆధర్, నామిని ఆధర్ కార్డ్, ఆధర్ తో ఆనుసంధాన మైన  మొబైల్ ఫోన్ నెంబర్, ఆధర్ నెంబర్ ఎంటర్ చేఊయగానే మొబైల్ ఫోన్ నెంబర్కు OTP  వస్తుంది, OTP  సదుపాయమ్ లేనివారు వయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ లేదా ఇరీస్ ద్వారా రన్నింగ్ లో ఉన్న బ్యాంకు అట్ మరియు  IFSC   కోడ్. ఈ e-Shram కార్డును మీ సమీప ప్రాంతాలలోని గ్రామ / వార్డు సచివాలయాలు, కామన్ సర్విస్ సెంటర్ల (CSC) లో నమోదు చేసుకోవచ్చు.  నమోదు చేసుకున్నా వెంటనే UAN కార్డు జారీ చేయబడును అని చెప్పారు.న్యాయవాది పి.నిర్మల మాట్లాడుతూ ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే అన్నీ రకాల సామాజిక భద్రత పథకాలు, వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం జరుగుతుంది. ఇందులో నమోదు చేసుకున్నా ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన (PMSBY) క్రింద రూ. 2 లక్షల ప్రమాద మరణ / అంగవైకల్య భీమా ఉచితంగా కల్పించడం జరుగుతుంది. ప్రభుత్వం ఆసంఘటితరంగ కార్మికులనుద్దేశించి చేసే పథకాలు & విధానాలకు ఈ డాటాబేస్ నే ప్రామాణికంగా తీసుకోనున్నారు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించి వారికి ఉపాధి కల్పించడం జరుగుతుందని  అన్నారు. ప్రత్యేక గమనిక :  27-01-2024, శనివారం రోజున మార్కెట్ యార్డ్ నందు ఈ – శ్రమ్   మరియు PYSYM  నమోదు క్యాంప్  ఏర్పాటు చేయడమైనది ఈ అవకాశమును అందరు ఉపయోగించవలయును.

About Author