వివాహానికి ఇన్సూరెన్స్.. రద్దయితే రూ. 10 లక్షలు !
1 min readపల్లెవెలుగువెబ్ : సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ లాంటి పదాలను విన్నాం. కానీ వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ఏంటి విడ్డూరం కాకపోతే అనుకుంటున్నారా ?. అవును మీరు చవివినది నిజమే. వివాహానికి కూడ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. వివాహ బీమా అంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల వివాహం రద్దు అయిన, ఏదైనా ఇతర నష్టం జరిగిన భీమా కంపెనీలు డబ్బులు చెలిస్తాయి. అయితే, కొన్ని నిబంధనలను మాత్రం తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. పెళ్లి అనివార్య కారణం వల్ల ఆగిపోయినప్పుడు లభించే వివాహ బీమా అనేది మీరు ఎంత బీమా చేశారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి బీమా ప్రీమియం అనేది మీకు ఇచ్చే హామీ మొత్తంలో 0.7 శాతం నుంచి 2 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు రూ.10 లక్షల వివాహ బీమా కావాలంటే, అప్పుడు మీరు రూ.7,500 నుంచి 15,000 ప్రీమియం చెల్లించాలి.