PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహిత ఆత్మహత్య…

1 min read

పల్లెవెలుగు  వెబ్ చెన్నూరు :  చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదర్ ఖాన్ కొట్టాలు గ్రామానికి చెందిన రాయచోటి సుబ్బ లక్ష్మి(40) సంవత్సరాలు అనే వివాహిత బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, ఖాదర్ ఖాన్ కొట్టాలు గ్రామానికి చెందిన పెద్ద రాజుతో, అలం ఖాన్ పల్లి గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి కి 20 సంవత్సరాల క్రిందట వివాహమైందన్నారు, వీరు ఇరువురు బేల్దారు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు, వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని, అయితే భర్త పెద్దరాజు మద్యానికి బానిసయ్యి ప్రతిరోజు మద్యం సేవిస్తూ భార్యను వేధించేవాడని తెలిపారు, దీనికి సంబంధించి ఆమె అత్తమామలు కుమారుడిని సమర్థించే వారని తెలిపారు, దీంతో ఆమె జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులరెడ్డి తెలిపారు.

About Author