అత్తింటి వారి వేధింపులకు వివాహిత బలి..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఫిబ్రనిత్యం ఓ భర్త వేధించడంతో ఓ భార్య వేధింపులు భరించలేక తనువు చాలించింది. భర్తతోపాటు అత్తమామలు సైతం గృహహింసకు పాల్పడడంతో ఎవరికీ చెప్పుకోలేక ఓ నిర్భాగ్యురాలు ప్రాణం తీసుకుంది. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా, గృహహింసకు పాల్పడకుండా మహిళనుల్ కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా నిత్యం ఏదో ఒక చోట మహిళలపై హింస చోటు చేసుకుంటూనే ఉంది.తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తారింటి వేధింపులు భరించలేక ఒక వివాహిత అనుమానాస్పద ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు కుటుంబ సభ్యులు,నందికొట్కూరు పట్టణ పోలీసుల వివరాల మేరకు మునగాలపాడుకు చెందిన 23 సంవత్సరాల చాంద్ భీ కి నందికొట్కూరు పట్టణానికి చెందిన పఠాన్ న్యాయమత్ ఖాన్ తో ఐదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు , ఏడాది వయస్సు కలిగి కుమారుడు కూడా ఉన్నాడు.అత్తింటి వారు గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక భర్తతోపాటు అత్త , మామ,ఆడపడుచులు కూడా సూటిపోటి మాటలు అంటూ చాంద్ భీ ని వేధించేవారు. మంగళవారం తెల్లవారుజామునఆత్మహత్యకు పాల్పడిందని బంధువుల ద్వారా సమాచారం అందుకున్న మృతురాలి తల్లిదండ్రులు తమ కుమార్తె మృతికి అత్తమామలు, ఆడపడుచులు, భర్త కారణమని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిత్యం తన కుమార్తెను వేధింపులకు గురి చేశారని హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరిస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆత్మహత్యకు పాల్పడటం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కూడా వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న నందికొట్కూరు పోలీసులు చాందీ భీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నందికొట్కూరు సీఐ విజయ భాస్కర్, పట్టణ ఎస్సై ఎన్వీ రమణ తెలిపారు.