బిల్ గేట్స్ కు మళ్లీ పెళ్లి !
1 min readపల్లెవెలుగువెబ్ : బిల్ గేట్స్ మరో పెళ్లికి సిద్ధమయ్యారు. భార్యతో గత ఏడాది విడాకులు తీసుకున్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. మళ్లీ ఆమెనే పెళ్లి చేసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. బిల్ గేట్స్, మిలిందా గేట్స్ దంపతులు దాదాపు 30 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత 2021 ఆగస్టులో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఓవైపు కరోనా, మరోవైపు మెలిండాతో విడాకులు, పిల్లలు కూడా ఇంటినుంచి వెళ్లిపోవడంతో జీవితం అసహజంగా ఉందన్నారు. మిలిందా తో వైవాహిక జీవితం గొప్పగా సాగిందని, ప్రస్తుతం ఆమెతో విడిపోయినా వృత్తిపరంగా మాత్రం ఇద్దరం కలిసే పనిచేస్తున్నామని తెలిపారు. మరొకరిని రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు రాలేదన్నారు. మళ్లీ మిలిందానే పెళ్లి చేసుకుంటారా అన్న ప్రశ్నకు, ‘ఔను’ అని సమాధానమిచ్చారు.