ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన మసాలా ప్రకాష్ .. హరికృష్ణ
1 min read
ఆలూరు ,న్యూస్ నేడు : వైస్సార్సీపీ పార్టీ అది నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు బాబు ష్యురుటీ మోసం గ్యారెంటీ మండల స్థాయి విస్తృత సమావేశానికి ముఖ్య అతిధి గా హాజరైన ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి కర్నూల్ జిల్లా యూత్ వింగ్ కార్యదర్శి మసాలా ప్రకాష్ మరియు కర్నూల్ జిల్లా పంచాయతీ రాజ్ జనరల్ సెక్రటరీ చిన్నహోతురు సర్పంచ్ హరికృష్ణ తమను గుర్తించి జిల్లా స్థాయి లో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా గౌరవ ఎమ్మెల్యే ని గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు ఇచ్చిన ఈ భాద్యతను అన్న అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతం చేయటానికి కృషి చేస్తామని ప్రకాష్ మరియు హరికృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
