మాస్కే.. రక్షణ కవచం
1 min read– బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : కోవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రతిఒక్కరూ నాణ్యమైన మాస్క్లు ధరించాలని బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ సూచించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆదేశాల మేరకు.. గురువారం బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాణ్యమైన క్లాత్ మాస్కులు విడుదల చేశారు. ఈ సందర్బంగా బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ ఒంటికి దుస్తులు, కాళ్లకు చెప్పులు ఎలాగో.. ముఖానికి మాస్కులు కూడా అత్యవసరమయ్యాయన్నారు. బహిరంగ ప్రదేశాలలో చిరువ్యాపారులు, మార్కెట్లలో రైతులు, బ్యాంకులు, వివిధ పనుల నిమిత్తం తిరిగే ప్రజలు వాడే మాస్క్లు నాణ్యతగా లేవని, దీంతో కరోన వ్యాప్తి చెందే అవకాశం అధికంగా ఉందన్నారు. రైతులు, చిరువ్యాపారులను దృష్టిలో ఉంచుకుని మాజీ ఎంపీ బుట్టా రేణుక నాణ్యమైన మాస్క్లు అందజేయాలని ఆదేశించడంతో… వారికి మాస్క్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ గట్టుపల్లి సురేందర్, కుర్ని నగర అధ్యక్షులు గణప చేనప్ప , బుట్టా ఫౌండేషన్ కోఆర్డినేటర్ హేమలత , వాలంటీర్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.