PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో సామూహిక జెండా ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ పట్టణంలోని తేరు బజార్ లో  శుక్రవారం యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో  75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన సీనియర్ న్యాయవాది సి. కారప్ప, డప్పు కళాకారుడు కొమ్ము పెద్ద రంగన్న, రైతు కొలిమి భాషుల్లా, కుండల తయారీదారుడు కుమ్మరి గంగన్న, పారిశుద్ధ్య కార్మికుడు పాముల రంగన్న లు గణతంత్ర జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా యువ స్పందన సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు  సురేంద్ర, లక్ష్మన్న   మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జనవరి 26,  ఆగస్టు 15వ తేదీలలో తేరు బజార్ యందు రైతులు, కూలీలు, కర్షకులు, కార్మికులు, వివిధ చేతి వృత్తుల వారు మరియు ప్రజల నడుమ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వివిధ వృత్తులలో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి వారికి సన్మానించడం చాలా గర్వకారణం అన్నారు. అనంతరం ముఖ్య అతిథులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ… ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, పాఠశాలల్లో,కళాశాలల్లో జెండా పండుగ నిర్వహించడం సాధారణమని, కానీ తేరు బజార్ ప్రాంతంలో మమ్మల్ని గుర్తించి రైతులు, కర్షకులు, కార్మికులు, ప్రజల నడుమ  సామూహిక జెండా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తదనంతరం కార్యక్రమానికి హాజరైన వారికి సొసైటీ సభ్యులు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుడు నరసింహులు,  యువ స్పందన సొసైటీ  సెక్రటరీ నాగరాజు, ట్రెజరర్ తులసీదర్ రెడ్డి, శ్రీరామ హాస్పిటల్ ఎండి నీలకంఠ, ఆర్ ఎస్ ఎం షాపింగ్ మాల్ నిర్వహకులు రమేష్,  ఉపాధ్యాయుడు నాగభూషణం, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆస్పరి శ్రీనివాసులు, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ అలీ, సొసైటీ సభ్యులు రామంజి, మురళి, చిన్న, సంజీవ్, ఉదయ్, జావీద్, తోఫీ, రైతులు, కార్మికులు  తదితరులు పాల్గొన్నారు.

About Author