ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల సామూహిక వివాహాలు
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు:ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనార్టీల సామూహిక వివాహాలు నిర్వహించినట్లు ఆ సంఘం నగర కార్యదర్శి పి ఇక్బాల్ హుస్సేన్ తెలియజేశారు. కర్నూలు నగరంలోని జి బి ఫంక్షన్ హాల్ నందు 5 జంటలకు సామూహిక వివాహాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనార్టీ వెల్ఫేర్ అధికారి మహబూబ్ బాషా,ఆవాజ్ జిల్లా కమిటీ కన్వీనర్ ఎస్ ఎ సుభాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల లో చాలామంది పేదవాళ్ళు తమ పిల్లల వివాహం చేసుకోవడానికి స్తోమత లేక బాధ పడుతున్నారని, అటువంటి వారికి కమిటీ నిర్వహించిన సామూహికవివాహాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.
ఈ సామూహిక వివాహాలకు అబ్దుల్ గఫూర్ అండ్ ఖామ్రున్నిసా బేగం పూర్ గర్ల్స్ మేరెజ్ అసోసియేషన్ వారు ఆర్థిక సహకారంతో ఆవాజ్ కమిటీ నిర్వహించడం అభినందనీయన్నారు. వధూవరులకు సంబంధించి (జహేజ్)5 జతల బట్టలు, అమ్మాయికి గృహ అవసరాలకు కావలసిన సామగ్రిని,అలమరి, గా డ్రెస్ మంచము ,సైకిల్ దాదాపు 40 వేల రూపాయల వస్తువులను ఒక్కొక్క జంటకు ఇచ్చినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ నగరఅదక్షులు బాబుఈ స్మైల్ ఉపాధ్యక్షులు అబ్దుల్ దేశాయ్, మొహమ్మద్ షరీఫ్, ఖాజా పాషా, మహబూబ్ బాషా, శక్షావలి, ఇంతియాజ్ ,ఇలియాస్, అబ్దుల్ గపూర్, ఫాయజుల్ కరీం, ఫాయాజ్ ఖాద్రీ, చోటు భాయ్ తది తరులు పాల్గొన్నారు.