ఆదోనిలో భారీ అగ్నిప్రమాదం
1 min read
పల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా జిల్లాలోని ఆదోని పట్టణంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంగన్ వాడి, హాస్టళ్లలకు, స్కూళ్లలకు ప్రభుత్వం తరపున వస్తువులు సరఫరా చేసే గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గుడ్లు, టన్నుల జొన్న పిండి, పాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా… ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు గల కారణాల అన్వేషణకు అధికారులు విచారణకు ఆదేశించారు.