భారీగా పతనమైన క్రిప్టో కరెన్సీ
1 min readపల్లెవెలుగువెబ్ : క్రిప్టో కరెన్సీలు శనివారం అత్యంత కనిష్ఠ స్థాయికి కుప్పకూలాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు పతనమైంది. 2021 నవంబరులో ఒక బిట్‌కాయిన్ విలువ సుమారు 69,000 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఇది 35,000 డాలర్ల వద్ద కనిపించింది. ఎథెరియం, ఫైనాన్స్ కాయిన్, కార్డనో వంటి ఇతర డిజిటల్ కరెన్సీల విలువ కూడా పతనమైంది. సోలానా, డొజ్‌కాయిన్, షిబా ఇను కూడా భారీగా నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండటం, మార్కెట్ నుంచి ఉద్దీపనను ఉపసంహరించే అవకాశం ఉండటంతో క్రిప్టో కరెన్సీల విలువ కుప్పకూలిందని విశ్లేషకులు చెప్తున్నారు.